కడదాకా కలిసొస్తానంటూ మాటివ్వు
అప్పుడు కూడా ఎదలో కాస్త చోటివ్వు
మబ్బులు ముసిరిన వేళ రవంత వెలుగవ్వు
ఏడు రంగుల కలనేతల హరివిల్లవ్వు
మండుటెండల బీటల బతుకున మెరుపవ్వు
చిరు చిరు నవ్వుల చల్లని జల్లుల వరమివ్వు
ఆశలు ఆరే చలిలో నిప్పుకణమవ్వు
ఆసరాల నులివెచ్చని స్పర్శల మంటవ్వు
ఉడిగిన వయసున చెదిరిన మనసున చెలిమవ్వు
మూసిన తలుపుల మాటున దాగిన తలపవ్వు
నీకై పిలుపొస్తే మలిచూపవ్వు
వంతెనకావల నాకై ఎదురుచూపవ్వు
ముందుగ నా వంతొస్తే తుది శ్వాసవ్వు
అప్పుడు కూడా ఎదలో కాస్త చోటివ్వు
(తల పండిన ఒక జంటని చూసిన ప్రేరణతో. చివరివరకూ కలిసి నడిచే జంటలకు "కడదాకా" అంకితం.)
Monday, October 13, 2008
Subscribe to:
Posts (Atom)