Saturday, July 19, 2008

పయనం

నీవు చెంత లేకున్నా
నీ చింతనతో సాగిన ప్రయాణం
ఈ మౌనంతో అంతరాయం
అడుగేయని నా అంతరంగం
కదలక మెదలక శిలనైన భావం
ఉలికైన లొంగని పాషాణమీ హ్రుదయం
నీ పిలుపుతో కరిగేను మైనం
నీ పలుకుతో నడిచేను ఆగిన నా పాదం

శబ్దరహిత శ్వాసలోన
నీకు దొరుకు స్వాంతనాన
పుట్టుకొచ్చే నిశ్చయం పురోగమనం
నా పదముతో నిలిచేను సాగే నీ చరణం

ఎవరైనా విన్నారా ఈ విడ్డూరం?!

ఎవరో ఒకరికే సాధ్యమీ పయనమని
ఎలుగెత్తి అరిచిన నీ నిశ్శబ్దశాసనం
నీకే విడిచి ఈ మార్గం
నేడు చిత్తరువైతిని నేస్తం

No comments: