నిజం ఉన్నచోట
అబధ్ధానికి చోటేలేదు
వెలుగు ఉన్నచోట
నిశీధికి నిలువనీడే లేదు
స్నేహం ఉన్నచోట
అపార్ధాలకు తావేలేదు
ప్రేమ ఉన్నచోట
ద్వేషానికి జీవం లేదు
ఈ సత్యం తెలుసుకో
నీ నయనం తెరుచుకో
ఆ సంకెల తెంచుకో
ప్రతి ఎదనూ గెలుచుకో
శత్రువు ఓ వ్యక్తి కాదు
శత్రువు ఓ శక్తి
మిత్రుడు ఓ శక్తి కాదు
మిత్రుడు ఓ వ్యక్తి
స్పందన సంహారం కాదు
కనుగొను మూలజడం
సంగ్రామం ప్రతీకారం కాదు
పగలను మొదలంటా నరకడం
ఆ యుధ్ధం నేర్చుకో
సంసిధ్ధం కాచుకో
శాంతికి ఓ సమిధవై
అనునిత్యం వెలిగిపో
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
అద్భుతం. చాలా బాగుంది.
Excellent
where there is love, no life to hatred...
Santhiki O samidhavai veligipo beautful..
శత్రువు ఓ వ్యక్తి కాదు
శత్రువు ఓ శక్తి
మిత్రుడు ఓ శక్తి కాదు
మిత్రుడు ఓ వ్యక్తి
Naa chinna burraki artham kaledandi..
konchem viveranchindi...
డాక్టర్ గారు, మంచి ప్రశ్న.
శత్రువు ఒక మనిషి (లేదా మనుషులు) అనుకుని, వాళ్ళని చంపేస్తే ఒక సమస్య తీరిపోతుందనుకోడం పొరపాటు. ద్వేషమనే శక్తి అసలైన శత్రువు. దాన్ని మొదలంటా నరకడం అసలైన సంగ్రామం... అని నా భావం...
మిత్రుడు అంటే ఒక భావం కాదు, మనుషులు... మనుషులతో స్నేహం, శక్తులతో యుధ్ధం అనేది అంతర్లీనంగా నా అర్ధం...
Post a Comment