కొంతకాలం కాలమాగిపోయింది
నిన్ననే మళ్ళీ గుండె కొట్టుకుంది
పలుకని చిలుక పలికింది
నా ఊహకు రెక్కలు తొడిగింది
ఓ స్నేహం గాయాల శకలాల మీద
మళ్ళీ పురుడుపోసుకుంది
ఎడారివేసవిలో మళ్ళీ వసంతమొచ్చింది
ఆ నవ్వులివిగో
విరిసిన పువ్వులివిగో
ఆ వెన్నెలిదిగో
మెరిసిన తారలివిగో
ఎన్నో చిందిస్తాయి అధరాలు మధురాలు
ఎన్నో అందిస్తాయి కైదండల దండలు
కాలం జాలం ఎవరికి ఎరుక?!
ఎపుడేం చేస్తోందో దైవానికి తప్ప!
(దాదాపు సంవత్సర కాలం తరువాత తిరిగొచ్చిన స్నేహం కంటే ఫ్రెండ్షిప్ రోజున గొప్ప బహుమతి ఏముంటుంది?! గాయాలు మాన్పిన కాలానికి, ఆ కాలాన్ని శాశించే దైవానికి నా కాలం అంకితం.)
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
చాలా చాలా బాగుంది మీ కవిత.
ఓ స్నేహం గాయాల శకలాల మీద
మళ్ళీ పురుడుపోసుకుంది
ఎడారివేసవిలో మళ్ళీ వసంతమొచ్చింది
అని అనటం ఎవరికి సాధ్యం?
స్నేహ మాధుర్యాన్ని చవిచూసి, కొంత విరహంతరువాత కలిసిన మనసులను ఇంత స్పష్టంగా ఆవిష్కరించటం ఎవరికి సాధ్యం?
నిత్యజ్వలిత హృదయాన్ని, నిరంతరం శోధించుకుంటూ, తవ్వుకుంటూ పోయేవారికి తప్ప.
హృదయానికి ఇచ్చే గొప్ప బహుమతి స్నేహమేనన్న జీవన సత్యాన్ని తెలుసుకొన్న వారికి తప్ప.
అది మీరు సాధించారు.
అభినందనలు
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా
Awesome!!
Just too good!! How did i miss this blog, all the while?? :-(
Post a Comment