శబ్దాన్నంతా బయటికి పంపేసి
నిశ్శబ్దాన్ని నింపెయ్యాలన్న తపన
అణువులోని పరమాణువులే ఒకదాన్నొకటి అంటిపెట్టుకుని ఉండలేనపుడు
నేను నిన్నే అంటిపెట్టుకుని ఉండాలనుకోడం ఎంత అవివేకం?!
మధుపానమైకంలో పరభాషా ముసుగులో నే జపించే ఒక్కో సత్యం
నీతో గడపలేని అ(తి)సాధారణ జీవితపు ఒక్కో ఘట్టం
ఆ తీరాన్ని వదిలి ఈ తీరాన్ని చేరలేక
సుడిగుండంలో చిక్కిన అసమర్ధపు నావికుణ్ణి నేను
నా తరమా భవసాగరమీదను.... నా వల్ల కాదు
ఏడ్పుకి నవ్వుల మాస్కులు, దుఃఖానికి కోపాల ముసుగులు...
ఇదే జీవితమైతే... ఇక నా వల్ల కాదు
నిండుగా ఉన్న హ్రుదయంలోంచి పొంగి పారేదే ప్రేమ అయితే
బీటలు వారిన నా పాత్ర నుండి నీకేమివ్వగలను ప్రభూ!!
కన్ను మూస్తే నిండే నీరు
కన్ను తెరిస్తే కారే కలలు
కలల్ని ఒడిసి పట్టాలంటే
కనుమూతే హాయి కదూ!
నా తనువులోని ప్రతి అణువూ తెలిసినంతగా
నా మనసులోని ప్రతి రేణువూ నీకు తెలిస్తే ఎంత బాగుణ్ణు!
నాకు నేనే అర్ధం కానప్పుడు
నీకు పూర్థిగా అర్ధం అవ్వాలనుకోవడం అత్యాశే కదూ!
గుండె చుట్టూ కట్టుకున్న రాతిగోడని
నీ కోసం బుల్డోజర్ తో బద్దలు కొట్టానే! ఇంక నన్ను ఎవరు రక్షించగలరు?!
వద్దంటున్న ప్రతి పెగ్గునీ పనిగట్టుకు మరీ తాగిన నేను
కాన్సీక్వెన్సెస్ అనే హాంగోవర్ లో ఊపిరాడక నేను
ఒకే కప్పు కింద పూడ్చలేని అగాధాలు
భార్యా, భర్తలకైతే డైవోర్స్; మరి పేరెంట్స్ కీ, పిల్లలకీ??
నీవు నాకు దూరమైనప్పుడు, నేను నీకు దూరమవడం అనివార్యం
ఆ గాయానికి నెప్పి తెలియకుండా ఖద చెపుతాను విను
వియోగవేళ నువ్వు కార్చే రెండు కన్నీటిబొట్లని చూసి హాశ్చెర్యపడిపోయేశాను -
'ఎప్పటికీ ఇంతలా ప్రేమించడం సాధ్యమా?' అని.
ఈ రోజే అర్ధమైంది - నా కళ్ళలోనూ సముద్రాలున్నాయని.
ప్రభూ! నీ చిత్తమే జరగనివ్వు. ఎప్పటికీ.
బయట బాగానే ఉంటావు, నా మీదే చిరాకు పడుతావంటూ నొచ్చుకునే పిచ్చితల్లికి
నా ట్రూ ఎమోషన్స్ చూపించేది తనదగ్గరే అని ఎప్పుడు అర్ధం అవుతుందో!
నాకెంత చేస్తే నీకంత గౌరవం ఇచ్చేంత సంస్కారం
అదృష్టవశాత్తూ ఇంకా అలవడలేదు
నిన్ను నిన్నుగా ప్రేమించడం వరకే నేర్చుకున్నా
నన్ను నన్నుగా ఉండనివ్వని ఇల్లు, ఊరు, దేశం, దేహం.... నాకు జైలు
హృదయం నలిగిన ప్రతిసారీ
తెలుగు ఎందుకు కారుతుంది?
కవితామడుగు ఎందుకు నిండుతుంది??
ఓ కాలమా! నమ్మకంలోని కమ్మదనాన్నీ
నిస్సహాయతలోని కర్కశత్వాన్నీ
ఒకేసారి ఎలా చూపావు?!
ఎక్కడెక్కడో ఉన్నా ఐ లవ్ యు అనే ప్లాటోనిక్ లవ్ గొప్పదా?
తిట్టుకున్నా కొట్టుకున్నా ఐ యాం విత్ యు అనే ప్రాక్టికల్ లవ్ గొప్పదా??
మనం జీవితంలో దేనినీ సీరియస్ గా తీసుకోకపోయినా
జీవితం ప్రతిదాన్నీ సీరియస్ గానే తీసుకుంటుందట! ఎంతటి చేదు నిజం!!
జీవితకాల పరమార్ధం కొన్ని మధురక్షణాలేనట
మిగతా కాలం అంతా తయారవడం, గుర్తుచేసుకోవడమేనట! ఎంత సత్యం చెప్పావోయ్ కవీ!!
ఉప్పునీటిని మంచినీటిగా మార్చుకోగలిగితే, ఎద్దడి తీర్చడానికి
సముద్రాలతోపాటు కళ్ళు కూడా సిధ్ధమే!
వగచేందుకు చేతినిండా కాలం ఉంది. ఇక లేనిదేముంది?!
అచ్చంగా నిన్నిచ్చేస్తే దైవాన్ని మరి తలచుకోనని భయం కాబోలు!
ఒక మనిషి అయితే యోగి, లేకుంటే భోగి తప్ప మరేమీ కాకూడదట!
- జీవితం మాష్టారు బెత్తంతో చెప్పిన పాఠం
ఏదైనా ఆట దాని రూల్స్ ప్రకారమే ఆడాలేమో! రూల్ బ్రేకయ్యిందా, విజిల్ మోగిందే.
నరకంలోనుండి బయటపడాలంటే ముందు అందులో ప్రవేశించే ధైర్యం కావాలట. మరి మళ్ళీ ప్రవేశించాలంటే?!
నీటిమబ్బుల్లో కూరుకుపోయిన వెన్నెల ఎప్పుడు బయటపడుతుందో!
అమూల్యమైన పూవు మరో తావికి వలస వెడుతుంది. పోనీలే, ఎక్కడున్నా సుగంధమేగా!
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
Very interesting.
బాగుంది
హాయ్,
చాలా బాగా రాసారు.
ఇలాంటివే కొన్ని లైన్స్ నేను కూడా నా డైరిలో రాసుకున్నను.
:)
చిరకాల దర్శనం.
వస్తూనే మాంచి పళ్లబుట్టతో వచ్చారు.
చాలా బాగుంది కవిత. కొన్ని ప్రతీకలు అద్బుతంగా ఉన్నాయి.
నిండుగా ఉన్న హ్రుదయంలోంచి పొంగి పారేదే ప్రేమ అయితే
బీటలు వారిన నా పాత్ర నుండి నీకేమివ్వగలను ప్రభూ!!
గొప్ప ఆర్తి దాగిన సన్నివేశ కల్పన.
హృదయం నలిగిన ప్రతిసారీ
తెలుగు ఎందుకు కారుతుంది?
కవితామడుగు ఎందుకు నిండుతుంది??
మదిలో ఉప్పొంగిన భావాలను ఒడిసిపట్టుకొని కవితా మడుగును నింపటం కవి పని. ఎంత నైపుణ్యంతో పట్టుకొని, ఎంత విస్త్రుతంగా సార్వజనీనం చేయగలడో అనే విషయంపైనే అతని కవిత ఆయుష్షు ఆధారపడిఉంటుంది.
ఉప్పునీటిని మంచినీటిగా మార్చుకోగలిగితే, ఎద్దడి తీర్చడానికి
సముద్రాలతోపాటు కళ్ళు కూడా సిధ్ధమే!
అద్భుతమైన ఉపమానం. కళ్లను సముద్రంతో పోల్చటం, పరిపాటయినా, ఈ కోణంలో చెప్పటం నవ్యంగా ఉంది.
నాకు నేనే అర్ధం కానప్పుడు
నీకు పూర్థిగా అర్ధం అవ్వాలనుకోవడం అత్యాశే కదూ!
అనాదిగా వస్తున్న డైలమ్మా. దీనికి సమాధానమూలేదు, పరిష్కారమూ లేదు. సర్ధుకుపోవటం తప్ప :-)
Hi,
This is the first time i visited your blog.
It's simply superb. Nice Literary Style
అణువులోని పరమాణువులే ఒకదాన్నొకటి అంటిపెట్టుకుని ఉండలేనపుడు
నేను నిన్నే అంటిపెట్టుకుని ఉండాలనుకోడం ఎంత అవివేకం?!
Awesome
Post a Comment