Thursday, February 26, 2009

రుచి

ఎంత తొందరగా చల్లారిపోయింది నిప్పుకణం
ఎంత త్వరగా చప్పబడిపోయింది మనస్నేహం

ఏమి వండావ్ ఏమి తిన్నావ్
ఎప్పుడు పడుకున్నావ్ పనమ్మాయి వచ్చిందా
రోజూ ఈ అర్ధం లేని పలకరింపులు
ఇదే స్నేహమని సరిపెట్టుకునే నిట్టూర్పులు

బాలేదా? అయితే మందేసుకో అనే సలహాలు
కొత్త బట్టలా? అయితే వెబ్ కాం లో కనిపించు అంటూ సరదాలు
పక్క ఊరిలో ఉన్నా, మరో దేశం లో ఉన్నా
నేస్తాలకై మనం పడే ఆరాటాలు

ఒంటరినైనపుడు ఓదార్చే జ్ఞాపకాలు
జీవితపు సుడిగాలిలో చెల్లాచెదరైనా
మళ్ళీ మనమంతా కలుస్తామనే నమ్మకాలు

నేస్తం! చప్పబడిందనుకోకు జీవితాన్ని త్వరపడి
చప్పరించేయబోకు తేలికగా జీవనాన్ని
ఋతువు మరల రావడమే ప్రకృతిలో సరళని
ఆస్వాదించి ఆనందించు అన్ని రుచులని

3 comments:

పరిమళం said...

మీ కవిత బావుంది .........మీ పరిచయం మరీ బావుంది .

Raj Verma said...

enda lo maadina maaduni challarchina lelethani kobbari neeru vale,
chali lo bigisina chetulani chumbinchina vechani mantala sega vale,
pagalantha kastinchina sramajeevini odaarchina saayam sandya vale,
reyantha nitturchina hrudayaaniki jeevamichina ravi toli kiranam vale,

mee ruchi loni shatruchulu, nasa loni padanisalu, kada daakaa nestham kosam niliche sneha bandhanaalu...
okkasaari naalo kaligina ee maduraanubhootulatho, mee bloguni veedaleka, veedukolu cheppaleka, selavu maatram teesukuntunna mee abhimaani...

Pastorjohnmoses said...

Bhavam daani nenukanunna bharam bagunnai. yada lothullonchi ubikina badabagni yendaroo jeevithalaku patalu.
ee rojullo hrudayantho matlade kavitha gani, gayapadina hrudayanni
sprunche amta gani levu.
nijanga edi naku chala bagundhi.

thank you
JOHN MOSES