Friday, July 11, 2008

నా నాయకుడు

ఇటీవల ఓ అమ్మాయి నన్ను అడిగింది - "నాకు చే అంటే ప్రాణం, మరి మీకెవరంటే ఇష్టం? మీరు ఎవరివల్ల ప్రభావితమవుతుంటారు?" - అని. నేను అన్నిటి నుండి, అందరి నుండి మంచిని తీసుకునే ప్రయత్నం చేస్తుంటాను... అంటే అందులో కొంత చెడు కూడా ఉన్నట్టేగా!... అది తెలుసుకుని, మంచిని గ్రహించి చెడుని వదిలేయడం మంచిది... నాకు అస్సలు చెడు కనిపించని మహా నాయకుడెవరో తెలుసా?! బలహీనతగా కనిపించే అతి బలమైన ఆయుధాలు ప్రేమ, త్యాగం, క్షమ ద్వారా ఈ ప్రపంచంలో అతి పెద్ద విప్లవాన్ని తెచ్చిన నాయకుడు... సంపూర్ణమైన స్వేచ్చని మనకు పరిచయం చేసిన నాయకుడు... దాదాపు రెండువేల సంవత్సరాల తరువాత, ఇప్పటికీ ప్రపంచం నలుమూలలా ఎంతోమందిని ప్రభావితం చేస్తున్న నాయకుడు, కాలం పరీక్షకు తట్టుకుని అన్నిటికన్నా గొప్ప ఇజంగా నిరూపించబడిన స్వేచ్చాసిధ్ధాంతాన్ని మనకిచ్చినవాడు... తను ఉపయోగించిన ఆయుధాలను తన శిలువ ద్వారా అనంతంగా సరఫరా చేస్తున్న నాయకుడు...

నా నాయకుడు...
రక్తం చిందించాడు, కానీ తనది మాత్రమే
ప్రాణం బలి ఇచ్చాడు, కానీ తనది మాత్రమే...
అది కూడా తిరిగి తీసుకునే శక్తి ఉంది కాబట్టి
మానవాళి మొత్తానికి అది అవసరం కాబట్టి
జీవం పోయడమే గానీ, తీయడం ఎరుగనివాడు

నా నాయకుడు...
సమాజానికి ఎదురీదాడు, అతి పెద్ద విప్లవానికి నాంది పలికాడు
అంటరాని వారిని అంటుకున్నాడు, వారిని పరిశుభ్రం చేశాడు
అసహ్యపాత్రులైన వారి ఇంట కలిసి భోంచేశాడు, వారి హ్రుదయంలో మార్పుకు శ్రీకారం చుట్టాడు
ఆడవారికి సమాన విలువనిచ్చాడు, అపనిందలను ఏమాత్రం లెక్కచేయక ముందుకు నడిపించాడు
గుడ్డివారికి వెలుగునిచ్చాడు, మనసు సంకెళ్ళను తెంచాడు

నా నాయకుడు...
ప్రళయాన్ని సైతం "శాంతం" అని శాశించిన పాలకుడు, నా మదిలోని కల్లోలాన్ని ఇప్పటికీ శాంతపరచగల సమర్ధుడు
ఇలలోని భోగాలన్నీ త్రుణప్రాయంగా త్యజించినవాడు, ప్రపంచమే తనదైనా అతి సామాన్యంగా జీవించినవాడు
అరులు సైతం భయంతో వణికే అరివీరభయంకరుడు, చిన్ని బిడ్డను చేరదీసే అమ్రుత హ్రుదయుడు
దండించే అర్హత తనకున్నా, దయనే ఎంచుకున్న దయామయుడు
తనజీవితపరమార్ధం కోసం శిలువనెక్కిన మానవోత్తముడు, అక్కడ కూడా వారి అజ్ఞానం క్షమించమని వేడిన దైవస్వరూపుడు

నాయకులకే నాయకుడు. మచ్చలేని మహానాయకుడు. నా అంతట నేనుగా, మనస్పూర్తిగా, పూర్తిగా శిరసు వంచే నా ప్రియతమ నాయకుడు - ఎష్షువా.

ఆయన గురించి రాసిన పుస్తకం ప్రపంచంలో ప్రతిఏటా అత్యధికంగా ముద్రిస్తున్న, అమ్ముడుపోతున్న పుస్తకం - బైబిల్. సినిమాలలో చూపించిన, అందరికీ తెలిసిన కధ మాత్రమే కాదు, ఆసక్తి ఉంటే చదివి తెలుసుకోండి...

ఆయనను అనుసరించడానికి నేను క్రైస్తవమతం తీసుకోనఖర్లేదు... అసలు యే మతాన్నీ అనుసరించనఖర్లేదు... నా సంస్క్రుతి, సత్సాంప్రదాయాలను వీడనఖర్లేదు... నా వేష, భాషలు మార్చనఖర్లేదు... సహజత్వాన్ని వదలనఖర్లేదు... నా సిధ్ధాంతాలు మంచివైతే, వాటినీ తెంచనఖర్లేదు... బలవంతంగా ఎవరిమీదా నా నమ్మకాలు రుద్దనఖర్లేదు... ఎవరినీ నేను మార్చనఖర్లేదు...

జీవించే విధానమే వేరు...

ఉపయోగించే ఆయుధాలే వేరు...

నడిపించే నాయకుడే వేరు...

4 comments:

Murali Mohan Lakka said...

hi yamini Nice article about nayakudu. I thibk you have nice command on telugu litt. That's great

Anonymous said...

చైనా ..భారత్ దేశాల్ని కలిపి పాలించిన కనిష్కుడు నాయకుడు.. లేదా రాజు ఎలా ఉండాలో చెప్పింది ప్రస్తావిస్తే బాగుండేది.

ashok.writings said...

Hi Sis, I love this... Nice one :)

Raj Verma said...

'Nayakudu' ane concept ki bahu chakkani nirvachanam... aa naayakudu nadachina maargaanni 'Matham' perutho rangulu poosi hangulu pondudaamane matha-andhulaki ee nirvachanam oka amarajyothi...