అటు చూస్తే ప్రళయారావం
ఇటు చూస్తే ప్రణవనాదం
అటు చూస్తే జనారణ్యం
ఇటు చూస్తే మనఃధ్యానం
అటు చూస్తే ప్రేమామ్రుతం
ఇటు చూస్తే జీవన్మరణం
అటు చూస్తే శస్త్రవిన్యాసం
ఇటు చూస్తే అస్త్రసన్యాసం
అటు చూస్తే త్వదీయతపం
ఇటు చూస్తే మదీయజపం
అటు చూస్తే సుప్రభాతం
ఇటు చూస్తే సుషుప్తగీతం
అటు చూస్తే నా మొత్తం
ఇటు చూస్తే నీ చిత్తం
ఎటు పయనం ఏది గమ్యం
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
బాగుంది. ఇంకొంచెం ఉంటే బాగుండేది.
ప్రేమామ్రుతం = ప్రేమామృతం
లేఖిని ( http://lekhini.org ) లో ఋకారానికి capital R నొక్కాలి.
Post a Comment