ప్రాతః కాలం కనులు తెరిచాక
ఫాలం చుంబించేంత దూరంగా ఉండు
పనిలో మునిగి అలసిన వేళ
అనుకోని ఆలింగనమంత దూరంగా ఉండు
అపరాహ్నం ఆకలిమంటకి
కొసరి వడ్డించేంత దూరంగా ఉండు
సాయం సంధ్య అందాలన్నీ
ముద్దుమోములో ప్రతిబింబించేంత దూరంగా ఉండు
ముసురేసిన నీలిమేఘపు గొడుగు కింద
మనసారా మాటలాడేంత దూరంగా ఉండు
పాలసంద్రంవంటి పండువెన్నెల్లో
పరవశాన పాట పాడేంత దూరంగా ఉండు
కలతలు నలతలు కలిగిన సమయాన
కలిసి జ్వరపడేంత దూరంగా ఉండు
నిశిరాతిరి మెలకువలో చేయి చాస్తే
నిశ్శబ్దంగా ఒదిగిపోయేంత దూరంగా ఉండు
దూరం అవుదామనుకున్న ప్రతిసారీ
దగ్గరయేంత దూరంగా ఉండు
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ఓహ్హ్! చాలా బాగుంది..
baagaa raasaaru.
baagundi
ఇక అది దూరమెందుకౌతుందీ ? .... :) :)
చాలా బావుందండీ !
భావస్వారూప్యత బహు నిండుగా ఉన్న మీ కవితలు చదివేకొద్దీ నాలో చిత్రమైన భావనలు కలుగుతున్నాయి...
చదవడానికి ఉపక్రమించే ముందు, ఆడుకోవటానికి అనుమతి పొందిన పసిమనసువలె, నా మది ఉప్పొంగుతుంది...
చదువుతున్నంతసేపు, ఆ పదకవితాకాసాన్న పయనిస్తున్న స్వేచ్చావిహంగంవలె, నా దేహం విహరిస్తుంది...
చదవటం ముగిసిన వేళ, అంతిమాధ్యాయానికి చేరువోతున్న ముదసలి అసువువలె, నా ఎద ఆరాటపడుతుంది...
Post a Comment