Thursday, February 2, 2012

ఆత్మావలోకనం


ఏ లక్ష్యం లేకపోవడం
ఎంతటి ఆప్తులై'నా' స్వేచ్చను హరించడం
అసలు అటువంటి వాతావరణంలో నేనుండడం
కఠిన నిర్ణయాలను నిరంతరం వాయిదా వేయడం
తోటివారితోనూ దైవంతోనూ సత్సంబంధాలు లేకపోవడం
ఆత్మీయుల సమూహానికి దూరంగా ఉండడం
ఏ ఆటలూ ఆడకపోవడం
నూతనంగా ఏమీ నేర్చుకోకపోవడం
తగినంత పనివొత్తిడి, జట్టు లేకపోవడం
స్వార్ధరహిత సేవాకార్యక్రమాలలో పాల్గొనకపోవడం
ఉన్న మంచిని దీవించడానికి బదులు
లోపాలను ఎత్తిచూపడం...

... ఇలా ఎక్కువకాలం ఉండడం
తద్వారా సంభవించేది లోపలి మరణం

శారీరకంగా
మానసికంగా
ఆధ్యాత్మికంగా
ఆర్ధికంగా
నను నేను సరిగా చూసుకోకపోతే
ఇంకెవరినీ సరిగా చూసుకునే స్థితిలో ఉండను
అనేది నిరూపించబడిన సత్యం

సమస్య ఏమిటో తెలిసిందిగా
సగం పరిష్కారం దొరికినట్టే!

(నను నేను సరిచేసుకునే క్రమంలో మౌనకుహరంలో కొన్నాళ్ళు తిష్టవేస్తే అది మీ తప్పు కాదని గ్రహించమని మనవి)

2 comments:

sharma said...

చాలా బావుంది మీ ఆత్మావలోకనం.
పైన ఉన్న వాక్యాల్లో కొన్ని నాకు వర్తిస్తాయి,
అవి మార్చుకొవాలని అనుకుంతున్నాను కాని ప్రయత్నం లోపం,
ఈ విషయాన్ని మీ టపా మళ్ళీ ఇంకొసారి గుర్తు చేసింది, నన్ను నెను మార్చుకోవాలి! ఆ శక్తి దేవుడే నాకు ఇవ్వాలి!!

sharma said...

పైవాటిలో నా లోపాలు
1. ఏ లక్ష్యం లేకుండా ఉండడం
2. కఠిన నిర్ణయాలను నిరంతరం వాయిదా వేయడం
3. నూతనంగా ఏమీ నేర్చుకోకపోవడం
4. తగినంత పనివొత్తిడి లేకపోవడం