Sunday, June 8, 2008

రుధిరస్వీకారం

ఎపుడూ దేవుళ్ళకి
నే చేసే అభిషేకాలే
ఏ దైవం చేసింది
నాకభిషేకం

ఎలుకతోక ఉతికినట్టు
పాపం నేనుతకడమే
ఏ దైవం తీసుకుంది
తనపై నా పాపం

ఎరిగీ ఎరగక
శిక్ష నేననుభవించడమే
ఏ దైవం చవిచూచింది
నా తప్పుల శిక్ష

బీడు జీవితం
ఎపుడూ నేదున్నడమే
ఏ దైవం కరుణించింది
తొలకరి చినుకై

ఎదిగేకొద్దీ మరకలతో
నా మనసు నిండిపోవడమె
ఏ దైవం మార్చింది
మళ్ళీ పసి మనసులా

తనదరి చేరాలని
ఎపుడూ నా తపనే
ఏ దైవం పడింది
వేదన నాదరికోసం

శిలువధారీ మ్రుత్యుంజయా
సంపూర్ణ మానవత్వం
సంపూర్ణ దైవత్వం
స్వీకరిస్తున్నా నీ రుధిరాభిషేకం

(గుడ్ ఫ్రైడే సందర్భంగా - మానవాళికై ఎల్లలెరుగని ప్రేమతో తన జీవాన్ని అర్పించి, మ్రుత్యుంజయుడై, మనిషికి దైవానికి మధ్య వారధిగా నిలిచిన ఏసుక్రీస్తుకి నా స్వీకారం అంకితం)

No comments: