Sunday, June 8, 2008

ఏమో!

నీవేనా?
నా మదిలో నిండి
ఉండీఉండక
దోబూచులాడుతున్నది

నిజమేనా?
మేధోసమరంలో
మనోసంగ్రామంలో
అలసి సొలసి
వెనుకకు వాలి
కనులు మూసిన మాగన్నులో
పెదవులతో నా నుదుటిపై
ఆనందపు నెలవంకను ముద్రించినది

కలయేనా?
నిన్న రాతిరి
కలత నిదురలో
లయతప్పక జోకొట్టినది
తన ఎదపై నాకు జోల పాడినది

తలపేనా?
సుతిమెత్తని కౌగిలితో
నను అల్లేసినది
ఈ జన్మకి విడలేని
బందీని చేసినది

(కల ఇల నడుమ త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడే ప్రేమికుల ప్రశ్నలన్నిటికీ నా సమాధానం - ఏమో!)

No comments: