Sunday, June 8, 2008

ఎప్పుడు?

ఎంత ఈదినా తరగని
కన్నీటి సంద్రం దాటేదెప్పుడు
పూదోట కనుల ఎదుట ఉన్నా
పన్నీటి గంధం మనసుని తాకేదెప్పుడు
ఎంతెంత దూరం ఇంకాస్త దూరం
పరుగు పందెం గెలిచేదెప్పుడు
దూరంగా ఊరించే ఎండమావి
ఒయాసిస్సు అయ్యేదెప్పుడు
కండలన్ని కరిగించినా
ప్రతిఫలం దక్కేదెప్పుడు
గుండెలవిసిపోయినా
సూర్యోదయం అయ్యేదెప్పుడు

నిరాశ చెందకు
దిగాలునొందకు
వైరాగ్యంతో హ్రుదయం నింపకు
సమస్య భారం దైవంపైన
శిరోభారం సహవాసులపైన
ఒక్క నిమిషం ముందూ రాదు
మరొక్క నిమిషం ఆలస్యం కాదు
సహాయం అందేను సకాలం
సమభావం నిండేను కలకాలం

(తమ ప్రయత్నలోపం లేకపోయినా ఆశించిన ఫలితాలు అందక దిగాలుపడే మిత్రుల ఆవేదనాభరితకన్నీటిప్రవాహానికి అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం, ధైర్యం చెప్పే సాహసం. వెలుగు వస్తుందనే నమ్మకం. ఇది మీకే అంకితం.)

No comments: