Sunday, June 8, 2008

సొంతం

కాంచినవన్నీ కావాలనే నైజం
అదో తరహా కాన్నిబాలిజం

తరులు విరులు
గిరులు ఝరులు
వినీల గగనాలు
అంతులేని సాగరాలు
ఏనాటికయేను నీసొంతం?

మనుషులు మనసులు
ముత్యాల పలుకులు
మనసారా నవ్వులు
మరలిరాని కాలాలు
ఎన్నటికి చేయగలవు పంజరం?

నచ్చినవన్నీ కాళ్ళవద్దకు
రావాలనడం
ఔనన్నా కాదన్నా
బానిసత్వం

నచ్చినవారు నీకుమాత్రమే
దక్కాలనడం
ఒప్పినా ఒప్పకున్నా
నిరంకుశత్వం

నీకు ఇచ్చిన కొంచెం
కనురెప్పల కాచుకో నేస్తం
నువు పెంచే మంచికి
దాసోహం అనదా సమస్తం

ప్రేమిస్తే ఈవిశ్వం కాదా నీసొంతం
లేదంటే నీస్వార్ధం మాటువేసిన వ్యాఘ్రం

(నచ్చిన ప్రతి వస్తువు, ప్రతి మనిషి తన సొంతం కావాలనుకునేవారికి స్వార్ధాన్ని విడిచి, ఏదీ సొంతం కాకుండానే జాగ్రత్తగా ఆనందించే బాటకు ఆహ్వానిస్తూ; దేనినైనా సున్నితంగా సమ్రక్షించి, తరువాతి తరానికి తమ విలువలను అందించే, తమకున్నది పదుగురికి పంచే నిస్వార్ధజీవుల సొంతం నా సొంతం)

No comments: