Sunday, June 8, 2008

పదండి

పదండి ముందుకు
పదండి తోసుకు
పోదాం పోదాం
పైపైకి

రోడ్డు మీద ప్రమాదమా?
రక్తంతో మననాప తరమా?
పక్కరోడ్డున చేరదాం గమ్యం
పందండి ముందుకు పదండి తోసుకు

నడివీధిన దారుణహత్యా?
ప్రాణంతీసి జడిపింప శక్యమా?
పక్కకు చూస్తూ పరుగు పెడదాం
పందండి ముందుకు పదండి తోసుకు

రైల్లో యువతి మానభంగమా?
రౌడీలంటే మనకేం భయమా?
పక్కపెట్టెలో ప్రయాణం చేద్దాం
పందండి ముందుకు పదండి తోసుకు

రాజుగారికి బట్టలు లేవా?
రాజ్యాంగాన్ని వివస్త్ర చేశారా?
పక్కవాడితో చూద్దాం నీలిచిత్రం
పందండి ముందుకు పదండి తోసుకు

మాత్రుదేశానికి పేదరికమా?
పుత్రోత్సాహం చరిత్రసత్యమా?
పక్కదేశాలకు వలస పోదాం
పందండి ముందుకు పదండి తోసుకు

పక్కవాడేమైతే మనకేం
పందండి ముందుకు పదండి తోసుకు

తన పదాలు చేస్తామని చెంబిస్త్రీ
కలనైనా ఊహించారా శ్రీశ్రీ?

(పక్కవారేమైపోతున్నా పట్టించుకోకుండా పరిగులెత్తే నేటి నాగరికాన్ని ఒక్క క్షణం ఆగమంటూ, ఈ రోజు వారు రేపు మీరే అని హెచ్చరిస్తూ, పరులకై తమ విలువైన కాలాన్ని వెచ్చించే మానవీయులతో పోదాం, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి)

No comments: