Sunday, June 8, 2008

సువార్త

అన్నా! మా ఊర్ల సువార్త
సబలుబెట్టిన్రు.... వత్తావా?!

ఆల్లరిత్తే...
చెవుల్ల తుప్పొదిలిపోవాల
ఆల్లు ఇంగిలీసు యాసల తమాసగ మాట్టాడితే...
కడుబ్బట్టుకు నవ్వాల

"నువ్వుత్తముండ"వని దేవున్ని
తిగడతన్నరో పొగడతన్నరో ...
దెలియక అయోమయంలబడాల
"మీ పిల్లలని బండకేసి బాదుడి" అంటే
పిచ్చినాయాల అన్నంతపనీ
జేత్తాడని అనుమానంగలగాల

అయినా నాకు తెలియకడుగుత అన్నా -
"అసలు ఏసయ్య బూమ్మీదుండగా
ఎన్నడైన ఇంత లొల్లి జేసిండంటవ?
ఏవోలే... సదువురానోల్లం
మనకేందెలుసని ఇనయంగుండాల

ఆల్లుబెట్టిన రొట్టెలు దినాల
ఆల్లిచ్చిన మెడతాల్లట్టుకెల్లి
ఇంటో దండెంగట్టాల

మడిసే సువార్తగుండాలని
ఈ పెద్దోల్లకెప్పుడుదెలియాల?!

(సువార్తలంటూ ఉపన్యాసాలు ఆంగ్లయాసలో దంచేసి, అర్ధంపర్ధం లేని అనువాదాలతో కడుపుబ్బ నవ్వించే క్రైస్తవ సోదరులకు కాలంతోపాటు మారమని సూచిస్తూ, వారే జీవమున్న సువార్తలైన మనుషులకు ఈ సువార్త అంకితం)

No comments: