Saturday, June 14, 2008

అపరిచిత

ఇన్నాళ్ళ మన స్నేహం
ఏమయింది నేస్తం
ఇన్నేళ్ళ అనుబంధం
అయిందా శూన్యం
ఈవల నేను ఆవల నీవు
చెప్పుకున్న కబుర్లు
నడిచిన చిరు నడకలు
అందవు లెక్కలు
వేనకు వేలు
అంటకుండా నా
కంట నిండిన నీకు
అడుగుల మడుగుల ఆగ్రహమా
నీతో గడిపే క్షణాలకై
నేగణించే ఆ నాలుగు కాలాలు
తెలిసీ అలుసయే మరుపుగేయమా
ప్రాణదాత నీ స్నేహం
ప్రళయమెలా అయింది చిత్రం
అంతరంగం తానైన నేస్తం
అపరిచితగా మారిన వైనం

(ఏడేళ్ళ పైగా సాగిన స్నేహంలో, ఈ సంవత్సరం వరదలతో భీభత్సం స్రుష్టించి, అకస్మాత్తుగా అపరిచితగా మారిన మా సీడర్ నదికి నా అపరిచిత అంకితం.)

No comments: