Sunday, June 8, 2008

నిరీక్షణ

మన నడుమ దూరం తగ్గినా
మనము నిండిన భారం తరిగేనా!

తరులన్నీ తన్మయమయే హర్షవర్షరుతువైనా
కరిమబ్బు తలపువనాన్ని తడిపేనా!

ఎదచిగురించే నవవసంతమెదురైనా
ఎలకోయిల పాతపాట పాడేనా!

క్లిష్టసాగరాలే దాటొచ్చినా
క్రుష్ణబిలం పూడేనా!

మానవ ప్రయత్నమేదైనా
దైవనిర్ణయం తెలిసేనా!

నీమదిని దాగున్న భావాలున్నా
నాకెన్నటికైనా తెలిపేనా!

కాలమంతా గడిచిపోయే తిరిగిరాని క్షణాలు
అంతమెపుడో తెలియరాని నా ఈ నిరీక్షణాలు

No comments: