అమాయకత్వం నిండిన బాల్యం
ఎపుడో కాక తప్పదు అంతం
మన గుండెకు పొడుస్తుంది చిల్లు
ఏదో ఓరూపంలో ముల్లు
పగతో రగిలే మనసు
పధ్ధతి దానికేం తెలుసు
ఎంత విధిస్తే శిక్ష
తీరును వారిపై కక్ష
మాటకు మాట చెయ్యికి చెయ్యి
పన్నుకు పన్ను కన్నుకు కన్ను
ఎపుడు పొయేనీ ఆటవికం
నడత నేర్చుకో నాగరికం
పగలూ ప్రతీకారాలు
పెంచేనా మమతానురాగాలు
కార్పణ్యాలే తుడిచెయ్
కొత్త పధంలో నడిచెయ్
'నా' అహం వదిలెయ్
నీ మదిలో శత్రువు గెలిచెయ్
ప్రతి ఎదలో కొలువున్న దైవానికి
సుప్రభాత గీతిక పాడెయ్
ప్రేమకు మించిన శిక్షే లేదని
చేతల్తో జగమంతా చాటెయ్
(పగప్రతీకారాల సహజబాటను వీడి, క్షమాప్రేమల దైవత్వబాటను నడిచిన ప్రేమమూర్తులకు నా ప్రతిస్పందన అంకితం - నిన్న గ్లాడిస్ స్టైన్స్, నేడు ప్రియాంక గాంధి హింసకు స్పందించిన తీరుకు ప్రభావితమై)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment