నీహారికా పరదాలు
పలుగువ్వల కువకువలు
భానోదయ లేతబాణాలు
మలయమారుత పవనాలు
దారికిరువైపులా
వ్రుక్షరాజ సుమవందనాలు
సుమధుర సౌరభాలు
రంగురంగుల గడ్డిపూలు
గరికపరకలపై హిమబిందువులు
కనులపండుగ హరితవనాలు
నిన్నరాతిరి హోరుగాలితో హోరాహోరీ
యుధంలో ఒరిగిన యోధులు వ్రుక్షకాండాలు
ఆధునిక హలాలు
అపుడే దున్నిన పొలాలు
మ్రుణ్మయ మార్గాలు
హరిణుల చరణముద్రలు
అపుడపుడూ పలకరించే లేడికూనలు
అశ్వాల నిశ్వాసాలు
కుందేళ్ళ పరుగు పందాలు
భారతీయవాగు వయ్యారాలు
సైకత వడ్డాణాలు
తేటనీటి గలగలలు
వెండికిరణాల మెరుపులు
తగరపు తళుకుల మిలమిలలు
మేలివర్ణాల మత్స్యపు మిడిసిపాటులు
బాతుల ఈతల విన్యాసాలు
అందంగా కట్టుకున్న బొమ్మరిళ్ళు
సహపాదచారుల చిరునవ్వుల శుభోదయాలు
వెరసి ఇవీ నా వాహ్యాళి విశేషాలు
(పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, అందంగా మలుచుకుని, పర్యావరణాన్ని రక్షించే బాధ్యత మనదేనని గుర్తు చేస్తూ, రోజూ నేనడిచే దారిని అద్భుతంగా ఉంచే భారాన్ని తలాకొంచెం పంచుకునే సంరక్షకులకు నా వాహ్యాళి అంకితం.)
ఇన్నాళ్ళకి నేను ప్రతిరోజూ వాహ్యాళికి వెళ్ళిన, 7.5 మైళ్ళ పొడవున్న, నా అడవిని ఒక దూరదేశపు స్నేహితుడు చిత్రపటాలుగా మార్చి పంపించాడు. మీరు కూడా చూస్తారా?!
http://picasaweb.google.com/timgarthwaite/2009SacFoxTrail#
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment