Sunday, June 8, 2008

కార్పొరేట్

రావయ్యా కాపిటలిస్టూ
ప్రతీదీ కార్పొరేటు చేసేద్దాం

బస్సుటాండు కార్పొరేటు
దవాఖానా కార్పొరేటు
ఎవసాయం కార్పొరేటు
బడిగూడా కార్పొరేటు

మరి కవితలెందుగ్గాదు
కార్పొరేటు? నువ్వేం బయపడకు
అదీ జేహేద్దాం కార్పొరేటు

కలంల సిరా ఉన్నంతవరకు
బుర్రల పదాలున్నంతవరకు
గుండెల అనుబూతులున్నంతవరకు
జీవితంల అనుబవాలున్నంతవరకు
అయి చదివే నీబోటోళ్ళున్నంతవరకు

కవితలు కార్ఖానాల్లో
తయారు చేసేద్దాం
మిషనులో ఏసి సుచ్చు ఏసేద్దాం
అసలదిగూడా ఆటోమాటిక్ చేసేద్దాం

నువ్వేం బయపడకు
కవితలుగూడా చేసేద్దాం కార్పొరేటు

(ప్రతిదీ కార్పొరేటు చేస్తున్న ఈ రోజుల్లో కవిత్వం లాంటి స్రుజనాత్మక అంశం కూడా కార్పొరేటు అయితే - అనే అలోచనతో ఈ వ్యంగ్య ప్రయోగం)

No comments: