Sunday, June 8, 2008

అంతం

ప్రతి కధకూ ఉందో అంతం
ప్రతి వ్యధకూ ఉందో అంతం
ప్రతి ప్రాణికీ ఉందో అంతం
ప్రతి విశ్వానికీ ఉందో అంతం

ఆది అంతాల నడుమ జీవనం ముఖ్యం
అది అద్వైతమైతే మరీ అందం

చావుపుట్టుకలు అతి సహజం
అన్నింటికీ ఉంటుందో అర్ధం
ఎన్నటికీ ఎడబాయనిదే దైవం
పెంచుకో ఆదైవంతో బంధం

ఏది ఏమైనా కంగారు వ్యర్ధం
ఒక చేయి దైవంతో
మరో చేయి మనిషితో
నడవడమే పరమార్ధం

ప్రతి అంతానికీ ఉందో అంతం
మరో ఆదికి ఆది అని దానర్ధం

(ఏది అంతమైనా జీవితం అంతం కాదనీ, మరో ఆరంభానికి మొదలు అనీ, ఏమైనా మనోస్థైర్యంతో ముందుకు సాగాలనీ భుజం తడుతూ; ఆద్యంతాల నిమిత్తం లేక, జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించేవారికి, తోటివారికి ఆ పూర్ణత్వం పంచేవారికీ ఈ అంతం అంకితం.)

No comments: