Sunday, June 8, 2008

తధాకిం?

పుట్టుక పెరుగుట
విద్య ఉద్యోగం
తధాకిం?

పదవి గెలుపు
వ్యూహం విజయం
తధాకిం?

వివాహం వినోదం
పిల్లలు పెంపకం
తధాకిం?

ఆస్థి అంతస్థు
బాధ్యత గౌరవం
తధాకిం?

వయసు ఆయాసం
రొష్టు రోగం
తధాకిం?

మారే తరం
తధ్యం మరణం
తధాకిం?

( కేవలం 'నా' ప్రపంచంతో సరిపెట్టుకోకుండా, తన చుట్టూ ఉన్నవారికోసం ఏదైనా మంచి చేయమని అందరినీ ఆహ్వానిస్తూ; తధాకిం? (తరువాత ఏమిటి?) అనే కధను చెప్పి, నాదైన బాటలో నడవమని ఆచరణతో స్పూర్తిని రగిలించిన అభినవ సాత్యకి, తన "సహజ"త్వాన్ని నాకు ధారాదత్తం చేస్తానన్న సాధ్వి విజయలక్ష్మి గారికి అంకితమిస్తూ, త్వరలోనే తధాకిం తెలియజేస్తానని మాటిస్తూ)

No comments: