"శరణమప్పా... అయ్యప్పా..."
ఠంగుమంటుందో మైకు...
కొండపైనుండి...
నాలుగ్గంటల తెల్లవారుఝామున
............
"పాహిమాం రక్షమాం
ఈ మైకులు తీయవేం.... "
అయిష్టంగా అష్టోత్తరం చదివిస్తూ
అజ్ఞానం క్షమించి తలవాల్చుదునా
"అల్లా హో అక్బర్..."
అయిదు గంటలకు
మా ఊరి మసీదు...
మరలా మైకులో
నిద్ర లేచి ప్రార్ధించమంటూ
"దేవుడా... ఆ నోరు నొక్కు...."
బలవంతంగా ప్రార్ధింపజేస్తూ
ఎలాగో మళ్ళీ నిద్రకుపక్రమింతునా
"నడిపించు నా నావ..."
మా వీధి చర్చి
ఆరుగంటల ఆరాధనా గళం...
అదే మైకులో
ఆ దైవం నేర్పిన ప్రేమ శాంతి
చుక్కాని కనపడనంత దూరం తరిమేస్తూ
మైకుల్లో మతిభ్రమించినట్లరిస్తేగానీ
మతతత్వం మదికెక్కదు కాబోలు
మతమంటే మంచిని పెంచే ప్రేమతత్వమని
ఎప్పటికి గ్రహిస్తారో మా ఊరి భక్తులు
(పోయినసారి మాత్రుభూమికేగినప్పుడు, నాకు కలిగిన అనుభవం - నిజమైన మతసారం తెలుసుకుని నిశ్శబ్దంగా ఆచరించిన తాతగారికీ, మరెందరో మహనీయులకు ఈ మైకు అంకితం)
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
chaala baagundi ee kavitha....maa village lo maa itni chuttu 2 temples..one masjid two churches unnaayi.... eppudynaa intiki vellinappudu..ika expect chesukovachu aa badha... vaaram motham "duvudi" seve :-)
Post a Comment