సమానత్వం లేనపుడు
సమాజం విసిరేసినపుడు
చెయ్యందించిన నేస్తం
జీవరేఖ నా దైవం
సమస్తం కోల్పోయినపుడు
ఏ ఆశా లేనపుడు
వెతుకుతూ వచ్చిన వెలుగు
నా చీకటిలో మెరుపు
అభిమానం కరువైనపుడు
అవమానాలెదురైనపుడు
నన్నాదుకున్న ఆర్తి
దిగంతాలకు పాకు నీ కీర్తి
నీకై వేచితి ప్రతిదినం
అడుగులు కలిపే ఉదయం
తీరా నువ్వెళ్ళిన ఆ క్షణం
నోచలేదు కడవీక్షణం
అన్యాయం చేసాడా దేవుడు
నా కాళ్ళు విరగ్గొట్టి
వేయలేకపోయా మిత్రమా
నీపై గుప్పెడు మట్టి
(చిన్నతనంలో కుష్టువ్యాధికి గురై, ఆనందవన్ లో ఆశ్రయం పొంది, బాబాతో ప్రతి ఉదయం నడిచి, తీరా ఆ మహానుభావుడు పరమపదించిన రోజున సమాధిపై గుప్పెడు మట్టిని వేయలేకపోయానే... అని బావురుమన్న బన్సీలాల్ వేదనకు అక్షరరూపం ఇచ్చే ఈ ప్రయత్నం - మహనీయుడు బాబా ఆమ్టే కు ఈ అక్షర మట్టి అంకితం)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment