Saturday, June 14, 2008

శోకం

నీ శోకం ఉప్పెనగా
నను ముంచేస్తున్న భావన
మన్ను మిన్ను ఏకధారగా
కురుస్తున్న భావన
ఘనీభవించిన కడగళ్ళు
వడగళ్ళుగా రూపాంతరిస్తున్న భావన
ఇంకడానికి ఇంకా శక్తి లేకున్నా
విచారమేఘం విస్తరిస్తున్న భావన
ఎదలోని వడిగాలులే
సుడిగాలులై విసిరేస్తున్న భావన
కట్టలు తెంచిన దుఃఖం
చెలియలికట్టలు తెంచేస్తున్న భావన

No comments: