ఉండీ లేకపోవడమా లేక
లేక లేకపోవడమా
మనసుండీ ప్రేమరాహిత్యమా లేక
మనసే లేకపోవడమా
కనులుండీ ద్రుష్టిశూన్యమా లేక
కనులే లేకపోవడమా
హ్రుదయముండీ స్పందించకుండడమా లేక
హ్రుదయమే పాషాణమవడమా
చదువుండీ సంస్కారశూన్యమా లేక
చదువే లేకుండడమా
నీవుండీ మౌనమా లేక
నీవే లేకపోవడమా
గాయమైతే దాచేయడమా లేక
గాయాలే లేకుండడమా
అందరి మధ్యన ఒంటరితనమా లేక
ఎవరూ లేకపోవడమా
జీవించీ సంకల్పరాహిత్యమా లేక
జీవితమే లేకపోవడమా
నాయకులై సేవపొందడమా లేక
నిత్యదాసులై సేవిస్తూ ఉండడమా
అన్నీ ఉండి అంతులేని విషాదమా లేక
ఏదీ లేకుండడమా
ఉండీ ఉండడమే మేలు
మనసుండి ప్రేమించడమే మేలు
కనులుండి చూడడమే మేలు
హ్రుదయముండి స్పందించడమే మేలు
చదువుండి సంస్కారముండడమే మేలు
మౌనంగా ఉన్నా నీవుండడమే మేలు
గాయమైతే దుఃఖించడమే మేలు
అందరి తలలో నాలుకైయుండుట మేలు
జీవించి సంకల్పముండుట మేలు
నాయకులై సేవచేయుట మేలు
అన్నీ ఉండి ఏమీ లేని భారరాహిత్యం మేలు
(అది లేక ఇది ఏదో ఒకటే ఉండాలనే అతివాదానికి ప్రతిగా, సమతుల్యమే జీవనసారమనే సత్యాన్ని గుర్తు చేస్తూ, ఆ కత్తిమీద సామును సునిశితంగా అభ్యసించువారి జీవితమే మేలు.)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment