రక్తమాంసాల శరీరమా?
సుఖదుఃఖాల హ్రుదయమా?
ఆశనిరాశల ఆత్మారామమా?
జన్మల మధ్య విరామమా?
శరీరం శాశ్వతమా?
కామితమేమైనా టెంకాయ
కొట్టడం సమ్మతమా?
అదే మోక్షమార్గమా?
బాహ్యనాటకం నిజమేనా?
మనమున ఏమున్నా చెల్లేనా?
లోపల మకిలి బయటకు మంచి
ద్వంద్వస్వభావం అతికేనా?
పరమాత్మకాలయం మమకాయం
ఆత్మసంభవం మద్వాగ్గంధం
సద్వాక్పరిపాలనాసాధనమిదం శరీరం
అంతరాంతరసత్యం మనస్సాక్ష్యం
ఆత్మ మనసు శరీరం
అన్నీ కలిసిన ఏకత్వం
అంతెత్తెదిగే మానవత్వం
(మనిషి అంటే శరీరము, మనసు, ఆత్మ అనే మూడు విడిభాగాలు; శరీరం శాశ్వతం కాదు కాబట్టి, మనమేమి చేసినా తరవాత కొన్ని శాంతులు చేస్తే సరిపోతుంది; మనసులో ఎలా ఉన్నా బయటికి మాత్రం చెడు చేయకుండా ఉంటే చాలు - అనే వక్రవేదాంతాలకు ప్రతిగా, అన్నీ కలిసిన పూర్ణత్వమే మనిషి అని; ఒకదానిపై మరొకటి విడదీయరాని ప్రభావాన్ని కలిగి ఉంటాయని; అలోచన, వాక్కు, చర్య భగవత్ప్రేరణతో త్రికరణశుధ్ధిగా జరగాలని చెప్పే ప్రయత్నం. నా హ్రుదయనేత్రాలను తెరిపించిన దైవానికి ఈ మనిషి అంకితం.)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment